పవన్‌ని ఫిదా చేసిన పోలెండ్ కుర్రాడు
పోలెండ్ చిన్నారి జిబిగ్జ్ యూట్యూబ్‌తో ఎక్కువ టచ్‌లో ఉండేవారికి తెలిసే ఉంటుంది. తెలుగు అన్నా, తెలుగు పాటలు అన్నా, తెలుగు సినిమాలన్నా ఈ చిన్నారికి ప్రాణం. 8 ఏళ్ల ఈ బుడతడు అప్పుడప్పుడు తెలుగు పాటలని పాడడం, డైలాగులు చెప్పడం చేస్తుంటాడు. ఇటీవల అఖిల్ లేటెస్ట్ మూవీ హలో చిత్రంలో మెరిసే మెరిసే అనే పాట పాడి తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. చిన్నారి పాట పాడిన విధానానికి ఇంప్రెస్ అయిన నాగ్ అద్భుతం అని బిజిగ్జ్ ట్వీట్‌కి కామెంట్ పెట్టాడు. ఇక అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ పాడిన కొడకా కోటేశ్వరరావు పాడిన పాటని తాను పాడి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు జిజిగ్జ్. హేయ్ పవర్ స్టార్ పాడిన సాంగ్ ఎంత ఎలక్ట్రిఫైయింగ్గా ఉంది. ఇది ఎప్పటికి బెస్ట్ సాంగ్ 2018 గిఫ్ట్‌గా ఈ సాంగ్ మీ కోసం. నా ట్వీట్ మీకు చేరితే దీనిపై మీ స్పందన తెలియజేయండి అని కామెంట్ కూడా పెట్టాడు ఈ పోలెండ్ చిన్నారి. అయితే పవన్ ఈ సాంగ్‌ని చూడడమే కాదు, జిబిగ్జ్ కామెంట్‌కి స్పందించాడు. చిన్నారి నేస్తం నీ పాట నాకు చేరింది. నువ్వు ఇచ్చిన కొత్త సంవత్సరం కానుకకు కృతజ్ఞతలు. భగవంతుడు నినున చల్లగా చూడాలి అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం జిబిగ్జ్ పాడిన పాట సోషల్ మీడియాలో పుల్ వైరల్ అయింది.













