Pawan Kalyan: సొంత డైరెక్షన్ లో సినిమా చేయాలనుంది

ఓ వైపు పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే తాను చేస్తానని ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan). ప్రస్తుతం ఉస్తాద్ భగత్‌సింగ్(ustaad bhagath singh) షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పవన్ త్వరలోనే దాన్ని పూర్తి చేయనున్నారు. రీసెంట్ గా హరి హర వీరమల్లు(hari hara veeramallu) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్, ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇంటర్వ్యూలో భాగంగా తనకు ఏ డైరెక్టర్ తో వర్క్ చేయాలనుందని అడగ్గా దానికి పవన్ చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా పర్టిక్యులర్ గా ఒక డైరెక్టర్ తో చేయాలనేమీ లేదని, తన సొంత డైరెక్షన్ లోనే సినిమా చేయాలనుందని తెలిపారు. గతంలో తాను డైరెక్టర్ గా చేశానని, కానీ దాన్ని ఆపేశానని, ఆ విషయంలో తనకు రిగ్రెట్ ఉందని అందుకే దాన్ని మళ్లీ కంటిన్యూ చేయాలనుందని పవన్ తెలిపారు.
అదే ఇంటర్వ్యూలో తనకెంతో మందితో కలిసి వర్క్ చేయాలనుందనీ, బాలీవుడ్ యాక్టర్ కే కే మీనన్(Kay Kay menon) తో కలిసి పని చేయాలనుకుంటున్నట్టు తన ఇంట్రెస్ట్ ను బయటపెట్టారు. పవన్ మాటల్ని బట్టి చూస్తుంటే ఫ్యూచర్ లో కూడా ఆయన సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిలా ఎక్కువ సినిమాలు చేయకపోయినా వీలు చూసుకుని అయినా చేస్తూ ఉంటారని క్లారిటీ వచ్చేసింది.