‘పంతం’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
చక్రవర్తి దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘పంతం’. మెహరీన్ కథానాయిక. సోమవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. గోపీచంద్ శైలి చిత్రాల తరహాలోనే దీన్ని మాస్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దారు. ‘సమస్యలు తీర్చాలంటే నాకు ఏదైనా పదవి ఉండాలి కదా!’ అని హాస్య నటుడు పృథ్వీ అంటుంటే, ‘పదవి ఉండి చేస్తే పనిమంతుడు అంటారు. ఏమీ లేకుండా చేస్తే శ్రీమంతుడంటారు’ అంటూ గోపీచంద్ డైలాగ్‌లు చెప్పడం నవ్వులు పూయిస్తోంది. శ్రీ సత్య ఆర్ట్స్ బ్యానర్‌పై రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.













