పెయిడ్ ప్రీమియర్ల ఆలోచనలో మిస్టర్ బచ్చన్
అనుకున్నట్లే మిస్టర్ బచ్చన్ సినిమా వచ్చే నెల ఆగస్ట్ 15న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే మిస్టర్ బచ్చన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వినిపిస్తోంది. ఆగస్ట్ 14 సాయంత్రం నుంచే ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్లు వేయాలని మేకర్స్ డిసైడయ్యారట. రవితేజ సినిమాలకు మామూలుగా ఇలా వేయడం చాలా అరుదు. గత కొన్నేళ్లలో ఇదే మొదటిసారి. ఇలా చేయడం వెనుక మేకర్స్ స్ట్రాటజీ వేరే ఉంది. ఆగస్ట్ 15న మిస్టర్ బచ్చన్ కు చాలా పోటీనే ఉంది. ముఖ్యంగా డబుల్ ఇస్మార్ట్ సినిమా మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని రిలీజవుతుంది. అందుకే ముందు రోజే మిస్టర్ బచ్చన్ కు ప్రీమియర్ షోలు వేస్తే తెల్లారేలోపు టాక్ ఆడియన్స్ లోకి వెళ్తుంది.
ఇలా చేయడం రిస్క్ అయినప్పటికీ మిస్టర్ బచ్చన్ కంటెంట్ మీద మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని, ఒరిజినల్ కంటే ఈ సినిమానే బాగుందనే రీతిలో మిస్టర్ బచ్చన్ ను హరీష్ శంకర్ తీర్చి దిద్దాడని అంటున్నారు. మొత్తానికి మిస్టర్ బచ్చన్ రాకతో ఆగస్ట్ 15కి బాక్సాఫీస్ ఫైట్ మరింత టఫ్ గా మారింది. విక్రమ్ తంగలాన్, 35, ఆయ్ సినిమాలు కూడా అదే రోజున రిలీజ్ కానున్నాయి.













