అసలు ప్రేమకుండాల్సిన అర్హతలేంటి?
రోషన్, అనూష జంటగా నటిస్తున్న చిత్రం నువ్వెందుకు నచ్చావె శైలజ. నాగేశ్వరరావు దర్శకుడు. వి.రామకృష్ణ నిర్మాత. హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సి.కల్యాణ్ క్లాప్‌నిచ్చారు. కొమర వెంకటేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కృష్ణమోమన్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించకూడదు? అసలు ప్రేమకుండాల్సిన అర్హతలేంటి? అనే విషయాన్ని స్పృశిస్తూ సాగే చిత్రమిది. ప్రస్తుత సమాజ పరిస్థితులకు అద్దం పడుతుందన్నారు. నాలుగు పాత్రల మధ్య నడిచే కథ ఇది. యువతరానికి కావాల్సిన అన్ని అంశాలూ ఉంటాయన్నారు నిర్మాత. సంగీతం :సాయి కార్తిక్.













