యన్టీఆర్ జీవిత కథ విడుదల
నందమూరి తారక రామారావు జీవిత విశేషాలను సమగ్రంగా పేర్కొంటూ యన్.టి.ఆర్. సమగ్ర జీవిత కథ పుస్తకాన్ని విడుదల చేశారు. ఇన్ కమ్ ట్యాక్స్ మాజీ చీఫ్ కమిషనర్ కాటా చంద్రహాస్, ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ కొడిదెల లక్ష్మీనారాయణ ఈ పుస్తకాన్ని రచించారు. యన్.టి.ఆర్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను, ఎదురైన విషమ పరిస్థితులను, సాగించిన పోరాటాన్ని, సాధించిన విజయ విశేషాలను, చేరుకున్న స్థావ విశిష్టతను గురించి ఇందులో వివరించినట్టు రచయితలు పేర్కొన్నారు. సాధికారిక సమాచారంతో, ఎన్టీఆర్ జీవిత విశేషాల పట్ల సమగ్ర అవగాహనతో, ప్రామాణికత, పారదర్శకతలే ప్రమాణాలుగా ఈ పుస్తకం రాసినట్టు వారు తెలిపారు. ఈ పుస్తకం ఆన్లైన్లో లభిస్తుందని చెప్పారు.













