దేవర ఫస్ట్ సాంగ్ అప్డేట్
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో చేస్తున్న సినిమా దేవర. ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ కు భారీ అంచనాలుండగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు సినిమా ప్రమోషన్స్ ఏమీ స్టార్ట్ చేయలేదు కానీ ఒక్కసారి స్టార్ట్ చేస్తే మాత్రం ఇక నాన్‌స్టాప్ గా ప్రమోషన్స్ చేయనున్నారట దేవర టీమ్. ప్రమోషన్స్ విషయంలో స్వయంగా ఎన్టీఆర్ కూడా ఈసారి ఇన్వాల్వ్ అవుతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాకు ఏ విధంగా ప్రమోషన్స్ చేస్తారో ఇప్పుడు దేవరకు కూడా అలానే ప్రమోషన్స్ చేయాలని ఎన్టీఆర్ డిసైడయ్యాడట.
అందుకే ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేసేలా చిత్ర యూనిట్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దేవర ఫస్ట్ సాంగ్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. అనిరుధ్ సంగీతంలో వస్తున్న దేవర సాంగ్స్ కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
యూనిట్ సభ్యుల నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం దేవర ఫస్ట్ సాంగ్ ఎంతో స్పెషల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన మెయిన్ సోల్ ఈ సాంగ్ లో హైలైట్ అయ్యేలా అనిరుధ్ ఈ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రామజోగయ్య శాస్త్రి ఇప్పటికే ఈ పాటకు సాహిత్యం అందించడానికి కూర్చున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనిరుధ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి వారి ఆశలను అనిరుధ్ ఏ మేరకు తీరుస్తాడో చూడాలి.













