War2: వార్2 టీమ్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) వార్2(War2) సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఇద్దరు హీరోలనూ ఒకేసారి చూడాలని అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.
అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే 60% షూటింగ్ పూర్తైందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. షూటింగ్ సగానికి పైగా అయిపోయినా వార్2 నుంచి ఎన్టీఆర్ కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఇప్పటికైనా వార్2 నుంచి ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేస్తే బావుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేకర్స్ ను రిక్వెస్ట్ చేస్తూ నెట్టింట ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వార్2 లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే తారక్ యాక్టింగ్ లోని మరో యాంగిల్ ను వార్2 లో చూసే ఛాన్స్ ఉంది. ఆగస్ట్ 15న వార్2 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.













