దేవర ఓవర్సీస్ టార్గెట్ పెద్దదే!
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా దేవర సినిమా ఓవర్సీస్ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. హంసిపీ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ దేవర ఓవర్సీస్ హక్కులను రూ.27 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. టాలీవుడ్ హిస్టరీలోని బిగ్గెస్ట్ ఓవర్సీస్ డీల్స్ లో ఇది కూడా ఒకటి. అయితే దేవర సినిమా ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అవాలంటే 5.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయలి.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ పెరిగినప్పటికీ సోలోగా 5.5 మిలియన్ డాలర్లు వసూలు చేయడమంటే మాటలు కాదు. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో కూడా ఓవర్సీస్ లో 4 మిలియన్ డాలర్ల మార్క్ ను దాటలేదు. అలాంటిది ఇంత పెద్ద టార్గెట్ ను దేవర మోస్తాడా అన్నది అనుమానంగా ఉంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.













