దేవరపై ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ నెక్ట్స్ లెవెల్
అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర మొన్నా ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది. ఈ సినిమా షూటింగ్ జరిగినంత కాలం తారక్ బయట ఈవెంట్లకు వచ్చింది తక్కువ. తన అన్నయ్య కళ్యాణ్ రామ్ కోసం వచ్చాడు కానీ మరీ జోష్ తో కనిపించిన ఈవెంట్స్ అయితే వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు.
దీనికి భిన్నంగా టిల్లు స్వ్కేర్ సక్సెస్ మీట్ కు వచ్చిన ఎన్టీఆర్ ఎంతో హుషారుగా కనిపించడంతో పాటూ దేవర సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్స్ కూడా ఇచ్చాడు. వాటిలో మొదటి కాలర్ ఎగరేయం. కొంచెం అతిగా అనిపించినా ఫర్లేదు, సినిమాపై ఎంతో నమ్మకంగా చెప్తున్నా. దేవర సినిమా చూశాక ఫ్యాన్స్ గర్వంగా కాలర్ ను పైకెత్తడం ఖాయమని నొక్కి చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియం చప్పట్లతో మోగిపోయింది.
అంతేకాదు, సినిమా నేపథ్యం భయం చుట్టూ ఉంటుందని, దాన్ని ఎలా ఎదుర్కోవాలనే పాయింట్ ను చూపిస్తుందని డైలాగు కూడా చెప్పాడు. ఎన్టీఆర్ హుషారు చూస్తుంటే ఇది టిల్లు స్వ్కేర్ ఈవెంటేనా అన్నట్లు అనిపించింది. ఏదైతే ఏంటి మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకున్న అప్డేట్స్ వచ్చేశాయి. త్రివిక్రమ్ ను ఉద్దేశించి అత్తారింటికి దారేది డైలాగ్ ను వాడుకుని తారక్ తన అభిమానాన్ని చాటడం ఇంప్రెస్ చేసింది. ఈ స్టేజ్ మీద ఆయనతో కలిసి ఉంటే అరవింద సమేత రోజులు గుర్తొస్తున్నాయని తనతో కలిసి మళ్లీ పని చేయాలనుందన్న కోరికను బయటపెట్టాడు ఎన్టీఆర్.













