NTR: తారక్ బర్త్ డే కానుకలివే!
మే నెల కోసం ఎన్టీఆర్(NTR) ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. దానిక్కారణం సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుతో పాటూ జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) బర్త్ డే కూడా అదే నెలలో ఉంటుంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి ఆయా చిత్ర మేకర్స్ ఫ్యాన్స్ కు కానుకగా కొంత కంటెంట్ ను రిలీజ్ చేసి ట్రీట్ ఇస్తూ ఉంటారు.
ఈసారి ఎన్టీఆర్ బర్త్ డే కు కూడా అలాంటి సర్ప్రైజులనే ప్లాన్ చేసినట్టున్నారు నిర్మాతలు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి వార్2(War2) కాగా, రెండోది ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో చేస్తున్న సినిమా. అయాన్ ముఖర్జీ(Ayan Mukharjee) దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న వార్2(War2) షూటింగ్ దాదాపు పూర్తైంది. ప్రశాంత్ నీల్ సినిమా రీసెంట్ గానే స్టార్ట్ అయింది.
ఈ రెండు సినిమాల నుంచి ఎన్టీఆర్ పుట్టిన రోజుకు సర్ప్రైజ్ లు రానున్నాయి. నీల్ సినిమా నుంచి ఆల్రెడీ ఓ చిన్న వీడియో గ్లింప్స్ రెడీ అయిందట. దాంతో పాటూ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారని టాక్. వార్2 నుంచి కూడా ఏదొకటి రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అంటే ఎన్టీఆర్ బర్త్ డే కు ఈసారి ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అన్నమాట.






