తిరుపతిలో ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్
ఎన్టీఆర్ బయోపిక్‌లో దర్శకుడు క్రిష్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. టైటిల్ రోలో లో బాలకృష్ణ నటిస్తుండగా బసవతారకం పాత్రను విద్యాబాలన్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పలు పాత్రలకు టాలీవుడ్ టాప్ స్టార్స్‌ను ఎంపిక చేయడం జరిగింది. సినిమాపై అంచనాలు పెంచేలా క్రిష్ ప్రతి పాత్రను విభిన్నంగా తీర్చిదిద్దుతున్నారట. ఎన్టీఆర్ చిత్రం రెండు పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి పార్టు ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 16న తిరుపతిలో భారీ ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. ఇందుకోసం అప్పుడే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేడుకలో పాల్గొనబోతున్నట్లు తెలిసింది. బాలకృష్ణ, విద్యాబాలన్, రానా, సుమంత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం జనవరి 9న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతున్నట్లు తెలిసింది. వంద కోట్ల బిజినెస్‌ను ఇప్పటికే ఈ చిత్రం చేసినట్లుగా చెబుతున్నారు.













