న్యూజెర్సిలో ఎన్టీఆర్ బయోఫిక్ ప్రీ రిలిజ్ వేడుక
విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కిన ‘యన్‌టిఆర్’ బయోపిక్ విడుదలను పురస్కరించుకుని న్యూజెర్సీకి చెందిన ఎన్టీఆర్ అభిమానులు ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 6వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్టీఆర్ మనవడు, సినీ నటుడు తారకరత్న ముఖ్య అతిథిగా విచ్చేసి అభిమానులతో సందడి చేశారు. అభిమానులు ఆయనను ఘనంగా సన్మానించి కేక్ కట్ చేయించారు. కేక్‌పై ‘యన్‌టిఆర్: కథానాయకుడు’ పోస్టర్‌ను డిజైన్ చేయించి దానిపై ‘ఎన్బీకే ఆర్మీ, న్యూజెర్సీ’ అని ప్రింట్ చేయించడం అందరినీ ఆకర్షించింది. రెండో భాగమైన ‘యన్‌టిఆర్: మహానాయకుడు’ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.













