ప్యారడైజ్ కు నాన్ తెలుగు దెబ్బ
ది ప్యారడైజ్(the paradise) విషయంలో నాని పెట్టుకున్న భారీ ఆశలకు మొదటి రెండ్రోజుల కలెక్షన్లు షాక్ ఇస్తున్నాయి. తెలుగు సినిమాగా రూపొందించినప్పటికీ, ఇతర భాషల ఆడియన్స్ కోసం స్పెషల్ కేర్ తీసుకుని డబ్బింగ్ పూర్తి చేసి తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా పేరున్న డిస్ట్రిబ్యూషన్ సంస్థల ద్వారా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంతో నాన్ తెలుగు మార్కెట్లపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
అయితే ప్రీమియర్స్ నుంచే సినిమాకు వచ్చిన నెగెటివ్ టాక్ థియేట్రికల్ రన్పై ఇంపాక్ట్ చూపుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల బయట ది ప్యారడైజ్ కు ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ కనిపించడం లేదు. హిందీ, తమిళ, మలయాళ వెర్షన్లలో ఓపెనింగ్స్ వీక్ గా ఉండగా, ఓవర్సీస్లోనూ మొదటి రోజు తర్వాత జోరు తగ్గినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. తెలంగాణలో రెండో రోజు పరిస్థితి కొంత మెరుగ్గా కనిపించినా, ఆంధ్ర ప్రాంతంలో డ్రాప్ స్పష్టంగా కనిపిస్తోంది.
నాని(nani) కెరీర్లోనే భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల(srikanth odela) దర్శకత్వం వహించారు. సుధాకర్ చెరుకూరి(sudhakar cherukuri) నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్(anirudh) మ్యూజిక్ అందించగా, కాయదు లోహర్ హీరోయిన్(kayadhu lohar) గా నటించింది. ప్రస్తుతం తెలుగు మార్కెట్లో సినిమా పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.








