ఎన్టీఆర్ పుట్టినరోజునాడు ఫస్ట్‌లుక్ లేనట్టే!
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. మార్చి 27న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని రామ్‌చరణ్ ఫస్ట్‌లుక్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ బర్త్‌డే మే 20. ఈసారి ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ వీడియోను విడుదల చేస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. అయితే వారికి ఈసారి నిరాశే మిగలనుంది.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్లుక్గానీ, వీడియోగానీ విడుదల చేయడం లేదని అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించిందని, దాంతో ఈ సినిమాకి సంబంధించిన వర్క్ పూర్తిగా నిలిచిపోయిందని, ఎన్టీఆర్ బర్త్‌డేకి అతని ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేద్దామని ఎంతో ట్రై చేసినా వీలు పడలేదని తెలిపింది చిత్ర యూనిట్. ఈ అకేషన్లో ఏదో ఒకటి రిలీజ్ చేసెయ్యాలని మాకు లేదు. ఈ వీడియో కోసం మీరంతా వెయిట్ చెయ్యాల్సినంత స్టఫ్ అందులో ఉంది. ఎప్పుడైతే ఈ వీడియో విడుదలవుతుందో.. ఆరోజు మనందరికీ పండగే అని తెలిపింది ఆర్ ఆర్ ఆర్ టీమ్.













