Mrunal Thakur: హద్దులు మీరినా ఛాన్సుల్లేవ్
బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చిన నార్త్ భామ మృణాల్(Mrunal Thakur) తన సినీ జీవితాన్ని ముందుగా మరాఠీ సినిమాలతో మొదలుపెట్టి ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. కానీ తన కష్టానికి తగ్గ ఫలితాన్ని బాలీవుడ్ లో అందుకోలేక పోయింది మృణాల్. కరెక్ట్ గా అదే సమయంలో మృణాల్ కు తెలుగులో సీతారామం(Sitaramam) సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది.
సీతారామంలో సీత పాత్రలో నటించిన మృణాల్ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తన నటనతో అందరినీ వావ్ అనిపించింది. సీతారామం తర్వాత మృణాల్ కు తెలుగులో వరుస పెట్టి ఛాన్సులు రావడంతో వేరే ఇండస్ట్రీ వైపు చూడలేదు. రెండో సినిమాగా నాని(Nani) తో చేసిన హాయ్ నాన్న(Hi Nanna) సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
అదే టైమ్ లో మృణాల్ కు తమిళంలో శివ కార్తికేయన్(Siva Karthikeyan) కు జంటగా ఏ ఆర్ మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వంలో అవకాశమొచ్చింది. కారణాలేంటో తెలీదు కానీ మృణాల్ మాత్రం ఆ అవకాశాన్ని వద్దనుకుంది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు మృణాల్ కు కోలీవుడ్ నుంచి మరో ఆఫర్ వచ్చింది లేదు. గ్లామర్ విషయంలో హద్దులు దాటినా అమ్మడికి సినిమా అవకాశాలు తగ్గాయనేది మాత్రం వాస్తవం. అయితే రీసెంట్ గా మృణాల్ ను ఎందుకు ఎక్కువ సినిమాలు చేయడం లేదని అడగ్గా, తను చేస్తున్న పాత్రలను ఆడియన్స్ ఆదరిస్తున్నారని అందుకే పాత్రల సెలెక్షన్లో జాగ్రత్తగా ఉంటున్నట్టు తెలిపింది.













