భరత్ అనే నేను… రాజకీయాల్లోకి రాను
రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని సినీ హీరో మహేష్‌బాబు సృష్టం చేశారు. భరత్ అనే నేను చిత్రం విజయం సాధించిన సందర్భంగా విజయవాడ వచ్చిన మహేష్‌బాబు తొలుత దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం క్యాపిటల్ సినిమాస్‌లో ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించి మీడియాతో మాట్లాడారు. సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో నటించారు. రాజకీయాల్లోకి వస్తారా అని విలేకరులు ప్రశ్నించగా రానని, వందేళ్లు వచ్చే వరకు సినిమాల్లోనే నటిస్తానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యల హామీలపై ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలపై మీ స్పందన ఏంటని అడగ్గా, తాను సినిమా గురించి మాట్లాడతానని, సున్నితంగా సమాధానాన్ని దాట వేశారు.













