ఓ నిర్ణయానికి రాలేకపోతున్న మిస్టర్ బచ్చన్
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ కు ఇది అధికారిక రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఓ డెసిషన్ కు రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15న రిలీజ్ అంటున్నారు కానీ అఫీషియల్ గా ఎక్కడా అనౌన్స్ చేసింది లేదు. అదే రోజున రామ్-పూరీ కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ తో పాటూ ఆయ్, 35 సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. విక్రమ్ తంగలాన్ కూడా అదే రోజున రానుంది. ఒకవేళ ఆగస్ట్ 15కి వస్తే మాత్రం డబుల్ ఇస్మార్ట్ తో పోటీ భారీగానే ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో మంచి అంచనాలతో ఆ సినిమా రానుంది. మరోవైపు ఇదేమో రీమేక్ మూవీ.
అలా కాదని ఆగస్ట్ 2న ఒక ఆప్షన్ ఉంది. కానీ తక్కువ టైముండటంతో ప్రమోషన్స్ కు కష్టమవుతుంది. పోనీ ఆగస్ట్ లాస్ట్ వీక్ కు వెళ్దామంటే సరిపోదా శనివారం ఇప్పటికే షెడ్యూల్ అయింది. ఇక ఇవన్నీ కాదనుకుంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కు వెళ్లడం తప్ప మరో దారి లేదు. కాకపోతే ఆ డేట్ కు కూడా సినిమాలు షెడ్యూల్ అయ్యి ఉన్నాయి. మరి మిస్టర్ బచ్చన్ రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.













