గిరిజన యువతిగా నిత్యమీనన్ ?
రాజమౌళి తాజా ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్. అవిశ్రాంతంగా సాగిన షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వడంతో ఎన్టీఆర్, చరణ్ విశ్రాంతిలో ఉన్నారు. త్వరలో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టేస్తున్నాడట జక్కన్న. చరణ్క జోడీగా ఆలియాభట్ చేస్తుంటే, ఎన్టీఆర్ సరసన నాయిక ఎవరన్నది ఇంకా ఖరారు కాకపోవడం తెలిసిందే. అయితే, ఎన్టీఆర్‌ను అమితంగా ప్రేమించే గిరిజన యువతి మాత్రం తరువాతి షెడ్యూల్ షూట్‌కు రెడీ అవుతోందట. ఆమె ఎవరో కాదు నిత్యమీనన్. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్‌లో తాజాగా నిత్యమీనన్ ఎంటరైనట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ ప్రాణ ప్రదంగా ప్రేమించే గిరిజన యువతిగా ఆమె కనిపించనుందట. ఒక పాత్రను నిత్యమీనన్ ఎంపిక చేసుకుందంటేనే ఆ పాత్రకున్న ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవచ్చు. నిత్య పాత్ర ఆడియన్స్‌కు బాగా కనెక్టవుతుందని అంటున్నారు. సెలెక్టెడ్ పాత్రల్ని మాత్రమే చసే నిత్యమీనన్, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకి తన ఇమేజ్ను ఎలా ఆపాదిస్తుందో చూడాలి.













