Mythri Movie Makers: ఊహించని కాంబినేషన్ ను సెట్ చేసిన మైత్రీ

టాలీవుడ్ లో ఎవరూ ఊహించని కాంబినేషన్ ఒకటి సెట్ అయింది. అదే నితిన్(Nithin)- శ్రీను వైట్ల(Srinu Vaitla) కాంబినేషన్. వీరిద్దరూ గత కొన్ని సినిమాలుగా ఫ్లాపుల్లోనే ఉన్నారు. 2016 నుంచి నితిన్ నుంచి 11 సినిమాలు రాగా అందులో భీష్మ(bheeshma) ఒక్కటే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మిగిలినవన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లుగానే మిగిలాయి. రీసెంట్ గా వచ్చిన తమ్ముడు(thammudu) సినిమా అయితే నితిన్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది .
మరోవైపు శ్రీను వైట్ల కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. శ్రీను వైట్ల హిట్ అందుకుని చాలా ఏళ్లవుతుంది. ఒకప్పుడున్నంత ఫామ్, కసి ఆయనలో లేవు. ఏదో పేరుకి సినిమాలు చేస్తున్నారు తప్పించి అవేవీ ఆకట్టుకునేలా లేవు. మొన్నా మధ్య మ్యాచో స్టార్ గోపీచంద్(gopichand) తో విశ్వం(Viswam) సినిమా తీస్తే ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. అలాంటి డైరెక్టర్ తో ఇప్పుడు నితిన్ సినిమా చేస్తున్నాడు.
అయితే ఇలాంటి ఎవరూ ఊహించని కాంబినేషన్ ను సెట్ చేసింది ఎవరో తెలుసా. టాలీవుడ్ లో క్రేజీ సినిమాలు తీస్తూ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచిన మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers). గతంలో శ్రీను వైట్లతో, నితిన్ తో మైత్రీ సినిమాలు చేయగా, ఇప్పుడు వారిద్దరితో ఓ సినిమాను ప్లాన్ చేసి ఆ బాకీని తీర్చాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే వీరిద్దరి కలయికలో ఓ సినిమాను చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మైత్రీ నిర్మాతలు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వీలుంది.