Nithin: మరో సినిమాను వదులుకున్న నితిన్

తమ్ముడు(thammudu) సినిమాతో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ ను అందుకున్న నితిన్(nithin), ఆ సినిమా తర్వాత తను చేయాల్సిన సినిమాలన్నింటిని నుంచి మెల్లిగా తప్పుకుంటూ వస్తున్నాడు. ఆల్రెడీ బలగం(balagam) ఫేమ్ వేణు ఎల్దండి(Venu Yeldandi) దర్శకత్వంలో చేయాల్సిన ఎల్లమ్మ(Yellamma) నుంచి తప్పుకున్న నితిన్, ఇప్పుడు మరో సినిమా నుంచి కూడా తప్పుకున్నాడని టాక్ వినిపిస్తుంది.
నితిన్ హీరోగా శ్రీను వైట్ల(srinu vaitla) దర్శకత్వంలో ఓ సినిమా రానుందని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) ఈ సినిమాను నిర్మించనుందని రీసెంట్ గా వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం నితిన్ ఈ సినిమా నుంచి కూడా తప్పుకున్నాడని తెలుస్తోంది. నితిన్ ఎందుకు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడనేది తెలియలేదు.
దీంతో నితిన్ తో చేద్దామనుకున్న కథను శ్రీను వైట్ల మరో యంగ్ హీరోకి చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని, ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్సే నిర్మించనుందని తెలుస్తోంది. అయితే నితిన్, తనకు ఇష్క్(ishq) లాంటి బ్లాక్ బస్టర్ ను ఇచ్చిన విక్రమ్ కె కుమార్(vikram k kumar) తో సినిమా చేయాలనే శ్రీను వైట్ల సినిమా నుంచి తప్పుకున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.