Seetha Payanam: సీతా పయనం హీరో ఎవరో తెలుసా?
యాక్షన్ కింగ్ అర్జున్(Arjun) కు సౌత్ లో చాలా మంచి గుర్తింపే ఉంది. ఆయన హీరోగా పలు సినిమాలు చేసి ఆడియన్స్ ను మెప్పించారు. ఇప్పుడు అతని కూతురు ఐశ్వర్య అర్జున్(Aiswarya Arjun) టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఆ సినిమా పేరు సీతా పయనం(Seetha Payaam). దానికి దర్శకత్వం వహిస్తుంది స్వయంగా అర్జునే. దీంతో ఈ మూవీపై మంచి క్రేజ్ ఏర్పడింది.
కూతురు హీరోయిన్ గా తండ్రి దర్శకత్వంలో సినిమా అంటే అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. పైగా దర్శకత్వం వహిస్తుంది హీరోయిన్ తండ్రి మాత్రమే కాకుండా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన వ్యక్తి. ఇన్ని అంశాలు ఉండటంతో సీతా పయనంపై ముందు నుంచే మంచి బజ్ నెలకొంది. ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే కానుకగా ఈ మూవీ రిలీజవుతుంది.
అయితే ఈ మూవీలో అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తుండగా,హీరోగా నటిస్తున్న అబ్బాయి గురించి రీసెంట్ గా అర్జున్ ఓ విషయాన్ని బయటపెట్టాడు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర(Upendra) అన్న కొడుకు నిరంజన్(Niranjan) ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడని, మూవీ తన కూతురి కోసం తీసినా, హీరోయిన్ కు సమానంగా హీరో క్యారెక్టర్ ఉంటుందని, వారిద్దరి పాత్రలకు ఉండే ఎలివేషన్లు, ఆ పాత్రల్లో ఉండే డిఫరెంట్ షేడ్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని అర్జున్ చెప్పాడు.













