ప్రేక్షకాదరణ పొందుతున్న జీ తెలుగు కొత్త సీరియల్స్ నిండు నూరేళ్ల సావాసం, జగద్దాత్రి
తెలుగు బుల్లితెరపై ఆకట్టుకునే సీరియల్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఛానల్ జీ తెలుగు. త్రినయని, ప్రేమ ఎంత మధురం, పడమటి సంధ్య రాగం సీరియల్స్ ప్రేక్షకుల ఆదారణపొందుతున్నాయి. ఇక, ఇటీవలే జీ తెలుగు ప్రారంభించిన నిండు నూరేళ్ల సావాసం, జగద్ధాత్రి సీరియల్స్ అంచనాలను మించి ప్రేక్షకులకు చేరువయ్యాయి.
ఈ సందర్భంగా నిండు నూరేళ్ల సావాసం నటీనటులు ప్రేక్షకులతో కలిసి సిద్ధిపేటలో శ్రావణమాసం వరలక్ష్మీ వత్రాన్ని కూడా నిర్వహించారు. ఇక జగద్ధాత్రి సీరియల్‌కి అయితే ఏకంగా భారీ కటౌట్లే వెలిశాయి. ఖమ్మంలో జగద్ధాత్రి 40 అడుగుల భారీ కటౌట్‌ని ఏర్పాటు చేశారు. ఈ భారీ కటౌట్‌కి అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఓ ఆర్మీ మేజర్ కుటుంబ కథతో సాగుతున్న సీరియల్ నిండు నూరేళ్ల సావాసం. ప్రేమ, ఆప్యాయత మధ్య సాగే ఈ సీరియల్ రోజురోజుకీ ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్లో అమర్, అరుంధతి, భాగమతి ప్రధాన పాత్రలు కాగా మనోహరి విలన్‌గా అదరగొడుతోంది. అరుంధతి చనిపోవడం, అమర్ జీవితంలోకి రావాలని మనోహరి ప్రయత్నం, భాగమతి జీవితంలోకి అమర్ రావడంతో ఈ సీరియల్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఆత్మగా మారిన అరుంధతికి తన చావు వెనక ఉన్న నిజం తెలిసిపోతుందా? భాగమతిని పిల్లలు తల్లి స్థానంలో అంగీకరిస్తారా? అమర్‌ని దక్కించుకోవడానికి మనోహరి ఎలాంటి ప్రయత్నాలు చేయబోతోంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూడాల్సిందే!
ఇక ఆగస్టు 21న ప్రారంభమైన జగద్దాత్రి సీరియల్ ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన అందుకుంటోంది. ప్రోమో, టైటిల్ సాంగ్ విడుదల చేసినప్పటి నుంచే ఈ సీరియల్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు అభిమానులు. అన్నపూర్ణలా చల్లని దీవెనలు అందించే ఆ ఆదిపరాశక్తి పాపాత్ముల పాలిట అపరకాళిలా మారుతుందో మనందరికీ తెలుసు. ఈ సీరియల్లోనూ జగద్ధాత్రి తన వాళ్ల పట్ల ప్రేమగా మసులుతూ అమాయకంగా సాధారణ అమ్మాయిగా బతుకుతూనే జగద్ధాత్రి(JD) ఐపీఎస్‌గా నేరస్థుల అంతుచూస్తుంది. ధాత్రి వృత్తిగత జీవితంలో అడుగడుగునా తోడుంటాడు కేదార్. కానీ కేదార్ తండ్రి ఎవరో తెలియకపోవడంతో చాలా అవమానాలు ఎదుర్కొంటాడు. మరోవైపు కౌశికి తన కుటుంబంలో జరుగుతున్న కుట్రలను కనిపెట్టలేక అందరినీ నమ్ముతూ ఉంటుంది. కేదార్ తండ్రి ఎవరు? జగద్దాత్రి జీవితంలో ఎలాంటి అవరోధాలను ఎదుర్కోబోతోంది? కౌశికి కుటుంబ సభ్యుల అసలు స్వరూపాన్ని తెలుసుకుంటుందా? వంటి విషయాలు తెలియాలంటే సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 గంటలకు ప్రసారమయ్యే జగద్దాత్రి సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!













