Vijay Devarakonda: ఆ డైరెక్టర్ తో రౌడీ హీరో మూవీ?
సైడ్ క్యారెక్టర్లలో నటించి తర్వాత హీరోగా మంచి సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. అయితే గత కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండ ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం విజయ్, గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో కింగ్డమ్(Kingdom) అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవాలని చూస్తున్నాడు విజయ్. అయితే విజయ్ తో లైగర్(Liger) సినిమా చేస్తున్నప్పటి నుంచే కరణ్ జోహార్(Karan Johar) విజయ్ తో మరో సినిమా చేయాలని ట్రై చేస్తున్నాడు. గత కొన్నాళ్లుగా ఆ ప్రాజెక్టును ఎవరితో చేయాలనే డిస్కషన్స్ కూడా జరిగాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ త్వరలోనే కిల్(Kill) డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్(Nikhil Nagesh Bhatt) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది.
డైరెక్టర్ నిఖిల్ రెండు వారాల కిందట హైదరాబాద్ లో విజయ్ ను కలిశారని, అన్నీ కుదిరితే ప్రస్తుతం విజయ్ కు ఉన్న కమిట్మెంట్స్ మొత్తం పూర్తయ్యాక వీరి కలయికలో సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ మూవీకి కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.













