అడ్వెంచర్ ను వెతికే పనిలో నిఖిల్
కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. కార్తికేయ-2 సినిమాతో నిఖిల్ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.120 కోట్లను కలెక్ట్ చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ కు మైథాలజీ కాన్సెప్ట్ ను యాడ్ చేసి ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు చందూ మొండేటి.
కార్తికేయ-2 బ్లాక్ బస్టర్ అవడంతో ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ అప్పట్లోనే అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా ఎప్పుడుంటుందనేది మాత్రం ఇప్పటికీ చెప్పలేదు. కార్తికేయ-3 కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో నిఖిల్ కార్తికేయ-3 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.
డాక్టర్ కార్తికేయ, సరికొత్త అడ్వెంచర్ ను వెతికే పనిలో బిజీగా ఉన్నాడు. త్వరలోనే రానున్నామంటూ నిఖిల్ ఈ సినిమా గురించి పోస్ట్ చేస్తూ రెండు ఫోటోలను షేర్ చేశాడు. మరో అడ్వెంచర్ థ్రిల్లర్ ను చూసేందుకు తాము కూడా రెడీగా ఉన్నట్లు ఆడియన్స్ కూడా నిఖిల్ పోస్ట్ కు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కార్తికేయ-3కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గత రెండు సినిమాలతో పోలిస్తే కార్తికేయ-3 మూవీ మరింత గ్రాండ్ గా తెరకెక్కనుంది. కాగా నిఖిల్ ప్రస్తుతం స్వయంభు, ది ఇండియా హౌస్ సినిమాలతో బిజీగా ఉంటే, డైరెక్టర్ చందూ మొండేటి తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు.













