ఆ దాడి జరిగింది నా ఇంటి దగ్గరే
న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ ప్రాంతంలో ఓ దుండగుడు ట్రక్‌తో ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఎనిమిది మందిని పొట్టనపెట్టుకున్న ఈ దాడి ఘటన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇంటికీ సమీపంలోనే జరిగిందట. ఈ విషయాన్ని ప్రియాంక ట్విటర్ ద్వారా వెల్లడించింది. న్యూయార్క్‌లోని నా అపార్ట్‌మెంట్‌కు 5 బ్లాకుల దూరంలో ఈ దాడి జరిగినట్లు ప్రియాంక ట్వీట్ చేసింది. పని ముగించుకుని అపార్ట్‌మెంట్‌కు తిరిగివచ్చిన సమయంలో బయటసైరన్లు మోగాయి. ఈ ఘటనలో మృతి చెందివారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని కోరుకుంటున్నానని ప్రియాంక ట్వీట్ చేసింది. అమెరికన్ టీవీ సిరీస్ క్యాంటికో మూడో సీజన్ షూటింగ్ నేపథ్యంలో ప్రియాంక చోప్రా ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంది.













