Mokshagna: మోక్షజ్ఞ లాంచింగ్ ప్రాజెక్ట్ పై కొత్త వార్త
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు సినీ రంగంలోకి అడుగుపెట్టబోతున్న విషయం ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) కొడుకు మోక్షజ్ఞ(Mokshagna) తొలి సినిమా విషయంలో ఇప్పుడు కొత్త వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. అతని డెబ్యూ ప్రాజెక్ట్‌గా తెరకెక్కబోతున్న సినిమా ఆదిత్య 999 మ్యాక్స్(Aditya 999Max). ఈ సినిమా గతంలో బాలకృష్ణ నటించిన క్లాసిక్ టైమ్ ట్రావెల్ మూవీ ఆదిత్య 369(Aditya 369)కు సీక్వెల్ గా రూపొందనుందనే సమాచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్(Krish) ఈ సినిమాను తెరకెక్కించబోతుండగా, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇప్పటికే వేగంగా సాగుతున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక అంశాలపై డైరెక్టర్ క్రిష్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ ఎంపిక కోసం ఆయన ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని సమాచారం. అలాగే కథకు తగ్గట్టుగా బలమైన క్యాస్టింగ్‌ను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఇతర పాత్రల విషయంలో కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఏప్రిల్ రెండో వారంలో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు.
ఇక మోక్షజ్ఞను స్క్రీన్ పై స్పెషల్ గా చూపించేందుకు టీమ్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటోందట. అతని లుక్‌ను స్టైలిష్‌గా డిజైన్ చేస్తూ కొత్త తరానికి తగ్గట్టుగా ప్రెజెంట్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తన వారసుడి ఎంట్రీ గురించి గతంలో బాలకృష్ణ మాట్లాడుతూ, మోక్షజ్ఞ కోసం తన వద్ద ఇప్పటికే అనేక కథలు రెడీగా ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా(Sai madhav burra) సంభాషణలు అందించనుండటం కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
ఇవి కూడా చదవండి








