AA26: బన్నీకి చెల్లిగా ఆ హీరోయిన్?

పుష్ప(Pushpa) ఫ్రాంచైజ్ సినిమాలతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun). దీంతో పుష్ప2(Pushpa2) తర్వాత బన్నీ(Bunny) ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మొన్న బర్త్ డే సందర్భంగా ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ, తన తర్వాతి సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee)తో అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు బన్నీ.
అనౌన్స్‌మెంట్ తోనే భారీ హైప్ దక్కించుకున్న ఈ సినిమా బన్నీ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజవుతుందనే విషయాల్లో ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి ఇప్పుడో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. AA26లో నజ్రియా నజీమ్(Nazriya Nazim) నటిస్తోందని, సినిమాలో అల్లు అర్జున్ కు సిస్టర్ రోల్ లో నజ్రియా కనిపించనుందని, ఆమె పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతన్నది తెలియదు కానీ నిజంగా నజ్రియా ఈ సినిమాలో బన్నీకి సిస్టర్ గా నటిస్తే మాత్రం సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయం.