22న అంజలి సీబీఐ విడుదల
లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం ఇమైక్క నోడిగల్. ఈ చిత్రాన్ని తెలుగులో అంజలి సీబీఐ పేరుతో అనువదిస్తున్నారు. ఆర్.అజయ్ జ్ఞానముత్తు ఈ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కించారు. టైటిల్ పాత్రలో నయనతార నటించింది. అధర్య, రాశిఖన్నా ఇతర ముఖ్య పాత్రధారులు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకునిగా నటించారు. తెలుగులో విశ్వశాంతి క్రియేషన్స్ హక్కులను పొందింది. సి.హెచ్. రాంబాబు, ఆచంట గోపీనాథ్ అనువదిస్తున్నారు. ఫిబ్రవరి 22న ఈ సినిమా విడుదల చేస్తారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళన్, ఛాయగ్రహణం: ఆర్.డి.రాజశేఖర్.













