హీరోలకు ధీటుగా లేడీ సూపర్‌స్టార్
ఈ మధ్య సినీ హీరోలంతా మల్టీప్లెక్స్ ల బిజినెస్ లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో మహేష్ బాబు ఈ ట్రెండ్ ను స్టార్ట్ చేశాడు. ఏషియన్స్ సంస్థతో కలిసి హైదరాబాద్‌లో ఏఎంబీ మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేసి దానికి మంచి క్రేజ్ దక్కేలా చేశాడు మహేష్. ఏ సినిమా అయినా సరే మహేష్ బాబు మల్టీప్లెక్స్ అంటూ జనాలు అక్కడకు బారులు తీరుతున్నారు. దానికి తోడు కొన్ని సినిమా ఈవెంట్లు కూడా ఇందులో జరగడంతో ఈ మల్టీప్లెక్స్ కు బాగా క్రేజ్ వచ్చింది.
మహేష్ బాబు తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ బిజినెస్ లోకి దిగారు. ఇది ఒక కొత్త బిజినెస్ గా ఉండటంతో పాటూ మంచి లాభాలొస్తున్న కారణంతో పలువురు ఈ మల్టీప్లెక్స్‌ల బిజినెస్‌పై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు హీరోలు మాత్రమే ఈ బిజినెస్ లో ఉండగా, ఇప్పుడు వాళ్లకు ధీటుగా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టబోతోంది.
దీని కోసం ఇప్పటికే నయన్ చెన్నైలోని మూత పడ్డ థియేటర్ అగస్త్యను కొనుగోలు చేసింది. ఆ థియేటర్ల ప్లేస్ లో నయన్ మల్టీప్లెక్స్, మాల్ ను కట్టబోతున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోనే అత్యంత విలాసవంతమైన మల్టీప్లెక్స్ గా నయనతార దీన్ని ఏర్పాటు చేయబోతుందట. దానికి సంబంధించిన ప్లానింగ్స్ ఇప్పటికే జరుగుతున్నాయని సమాచారం. మరి ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ రంగంలో నయన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.













