RC17: చరణ్- సుక్కూ మూవీపై అప్డేట్ ఇచ్చిన నిర్మాత

గేమ్ ఛేంజర్(game changer) సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan) ప్రస్తుతం బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో పెద్ది(peddi) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్దితో ఆడియన్స్ ను అలరించి మంచి హిట్ కొట్టాలని చూస్తున్న చరణ్ ఈ సినిమా తర్వాత సుకుమార్(sukumar) దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
దీంతో సుకుమార్- రామ్ చరణ్ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాతలు దాని గురించి అప్డేట్ ఇచ్చారు. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేయనున్న RC17 సినిమా గురించి సినిమాను నిర్మించనున్న మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మాతల్లో ఒకరైన నవీన్ యేర్నేని(naveen yerneni) డ్యూడ్(dude) సక్సెస్ మీట్ లో మాట్లాడారు.
సుకుమార్ తర్వాతి సినిమాగా రామ్ చరణ్ తో చేసే సినిమానే ఉంటుందని, ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ లేదా మే నెలలో మొదలవుతుందని చెప్పారు. ఆల్రెడీ చరణ్- సుక్కూ(sukku) కాంబోలో రంగస్థలం(rangasthalam) మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ అవడంతో ఇప్పుడీ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. పైగా ఈ సినిమా రంగస్థలంకు సీక్వెల్ అని కూడా వార్తలొస్తున్నాయి. అందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.