నాని, సుధీర్ బాబు ‘వి’ ప్రారంభం
నాని, సుధీర్ బాబు అదితీరావు హైదరి, నివేదాథామస్ హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణసంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నె 36 చిత్రం వి చిత్రంను హైదరాబాద్‌లో ప్రారంభించారు. శ్రీమతి అనిత సమర్పణలో శీరష్, లక్ష్మణ్, హర్షిత్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలి సన్నివేశానికి దర్శకుడు ఎంసిఎ డైరెక్టర్ శ్రీరామ్ వేణు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు త్రినాధరావు నక్కిన కెమెరా స్విచ్చాన్ చేశారు. ఎఫ్2 డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.













