నాని పాన్ ఇండియా ప్లాన్ సూపర్
ప్రస్తుత రోజుల్లో ప్రతీ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతుంది. హీరోలందరూ తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. వారిలో నేచురల్ స్టార్ నాని(nani) కూడా ఉన్నాడు. దసరా సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసినప్పటికీ ఆ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తప్పించి మిగిలిన భాషల్లో పెద్దగా క్లిక్ కాలేకపోయింది.
అయితే తన తర్వాతి సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న నాని తను చేయనున్న సినిమాలు అన్ని భాషల వారికి దగ్గరగా ఉండేలా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. అందుకే కంటెంట్ విషయంలోనే కాదు క్యాస్టింగ్ విషయంలో కూడా నాని కాంప్రమైజ్ కావడం లేదు. రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం(Saripoda Sanivaram) సినిమాలో కూడా నాని ఆ స్ట్రాటజీ ఫాలో అయ్యాడు.
ఆ సినిమాలో ఎస్జె సూర్య(SJ SUrya)తో కలిసి నటించిన నానికి కోలీవుడ్ లో మంచి పట్టు దొరికింది. ఇప్పుడు అదే విధంగా నాని తర్వాతి సినిమాకు కూడా ప్రణాళికను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఓజీ డైరెక్టర్ సుజిత్(Sujeeth) దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో నానితో పాటూ మరో హీరో కూడా కనిపించనున్నాడట. నానితో సమానంగా ఆ పాత్ర ఉండనుందని సమాచారం. ఆ పాత్రకు నెగిటివ్ టచ్ కూడా ఉంటుందని టాక్. ఆ పాత్రకు టాలీవుడ్ హీరోని కాకుండా మరో భాషలోని హీరోని తీసుకోవాలని చూస్తున్నారట. త్వరలోనే ఆ హీరో ఎవరనేది కూడా తెలియనుంది.













