నాట్యం ఫస్ట్ సాంగ్ ను ఆవిష్కరించిన బాలకృష్ణ
నాట్యం చిత్రం తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియాగ్రాపర్గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా పరిచయం అవుతున్నారు. ఆమె తన డాన్స్, హావభావాలు, నటనను అద్భుతంగా పండించారు. ఈ సినిమాలో తొలి సాంగ్ నమ శివాయ ను నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన, సంధ్యారాజు, దర్శకుడు రేవంత్ కోరుకొండ్, యాక్టర్ కమట్ కామరాజు తదితరులు నాట్యం సినిమా కోసం పడ్డ కష్టం అసాధారణమని కొనియాడారు. ఇలంటి ఓ వైవిధ్యమైన సినిమాను, పాటలను ఈ తరానికి అందించడం గొప్ప విషయమని ప్రశంసించారు.













