NBK: ముంబై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(NSE) చరిత్ర సృష్టించిన నందమూరి బాలకృష్ణ

బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ప్రతినిధులతో కలిసి శ్రీ నందమూరి బాలకృష్ణ (Balakrishna) ముంబై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) ను సందర్శించారు.
ఈ సందర్శన సందర్భంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE అధికారులు ఆయన గౌరవార్థం స్టాక్ ఎక్స్చేంజ్‌లోని ఘంటా మోగించే అవకాశం కల్పించారు.
ఈ గర్వకారణమైన ఘట్టం స్టాక్ ఎక్స్చేంజ్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. శ్రీ నందమూరి బాలకృష్ణ NSEలో ఘంటా మోగించిన మొట్టమొదటి దక్షిణ భారతీయ నటుడు మరియు సినీ ప్రముఖుడు అనే విశిష్ట గౌరవాన్ని పొందారు.
ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఒక ప్రముఖ నటుడు మరియు ప్రజా ప్రతినిధిగా ఆయన స్థాయికి లభించిన గుర్తింపుతో పాటు, సినిమా, సేవా కార్యక్రమాలు మరియు కార్పొరేట్ సంస్థలను జాతీయ స్థాయిలో కలిపే ఒక ప్రతీకాత్మక సందర్భంగా నిలిచింది.