చిత్రీకరణ పూర్తి చేసుకున్న నాకిదే ఫస్ట్ టైమ్
ధనుష్‌బాబు, సింధూర, కావ్య ముఖ్య తారలుగా రామ్‌రెడ్డి ముస్కు దర్శకత్వంలో కురుపా విజయ్‌కుమార్ ముదిరాజ్ నిర్మిస్తున్న చిత్రం నాకిదే ఫస్ట్ టైమ్. ఇటీవల తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి పాటలు, ప్రచార చిత్రాల్ని విడుదల చేశారు. తొందర పాటు నిర్ణయాలతో జీవితాన్ని సమస్యలమయం చేయకుండా మంచైనా, చెడైనా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పే చిత్రమిది. ప్రేమ, వినోదం, శృంగారం, భావోద్వేగాలతో తెరకెక్కించాం అని దర్శకుడు అన్నారు. చిత్రీకరణ పూర్తియింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అని నిర్మాత అన్నారు.













