నాకిదే ఫస్ట్ టైమ్ ఆడియో
ధనుష్, ఆదిత్య, కావ్య, సింధూర రౌత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం నాకిదే ఫస్ట్ టైమ్. రామిరెడ్డి దర్శకుడు. విజయ్ కుమార్ నిర్మాత. ఈ చిత్ర పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి ముఖ్య అతిథిగా హాజరై తొలి సీడిని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్తవాళ్లయినా బాగా నటించారు. ఈ చిత్ర బృందానికి మంత్రి తలాని శ్రీనివాస్‌యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికీ తన జీవితంలో ఇదే తొలి సారి అనుకునే సందర్భంగా ఒకటి ఉంటుంది. ఈ చిత్రంతో కథానాయకుడికి కూడా ఇలాంటి అనుభవమే ఒకటి ఎదురవుతుంది. తనకు ఎదురైన ప్రతికూల పరిస్థితుల నుంచి ఎలా బయట పడ్డాడన్నది తెరపైనే చూడాలి. కథాంశానికి తగ్గట్లుగానే టైటిల్‌ను పెట్టాం తప్ప, మరే ఉద్దేశం కాదన్నారు. సాయి వెంటక్, టి.రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.













