పవన్‌కల్యాణ్ ను టార్గెట్ చేసిన ‘నగ్నం’ హీరోయిన్
ట్విట్టర్లో ట్వీట్స్ పెట్టినంత ఈజీగా సినిమాలు చేసేస్తున్నాడు రామ్‌గోపాల్‌వర్మ. కరోనా వైరస్, నగ్నం, క్లైమాక్స్ వంటి సినిమాలని వెంట వెంటనే చేసేసిన వర్మ ఇప్పుడు మర్డర్ సినిమా చెయ్యబోతున్నాడు. ఇటీవల ఓటీటీలో విడుదలైన నగ్నం సినిమాని ఎంతో బోల్డ్‌గా తీశాడు వర్మ. ఇందులో హీరోయిన్గా నటించిన స్వీటీ తన అందాలన్నీఆరబోసింది. ఇప్పుడు అడిగిన వారందరికీ ఇంటర్యూలు ఇస్తూ బిజీగా ఉంది. ఒక ఇంటర్వూలో ఆమె పవన్‌కల్యాణ్‌ని టార్గెట్ చేసింది. పవన్‌కల్యాణ్ అంటే తనకు క్రష్ అనీ, అతనితో డేటింగ్‌కి కూడా తాను సిద్ధమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
“టాలీవుడ్ హీరోల్లో నాకు పవన్‌కల్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయన్ని కలవాలని చాలా సార్లు ట్రై చేశాను. కానీ, కుదరలేదు. ఆ తర్వాత ఆ ప్రయత్నం విరమించుకున్నాను. ఆయన్ని కలవడానికి ఎవరి రికమండేషన్ తీసుకోదలుచుకోలేదు. ఆయన్నికలిసే టైమ్ వస్తే ఖచ్చితగా కలుస్తాను అని గట్టిగా నిర్ణయించుకున్నాను. పవన్ అంటే ఎంత ఇష్టం అంటే నన్ను డేటింగ్‌కి రమ్మన్నా వెంటనే ఓకే చెప్పేస్తాను. ఆయనతో కలిసి ఒక్క సినిమాలోనైనా నటించాలని నా కోరిక” అని తెలియజేసింది. తాను ఇటీవల బాలకృష్ణను కూడా ఆయన ఇంటికి వెళ్లి కలిసానని, తనను చూసి నార్త్ హీరోయిన్ అనుకున్నారని తెలిపింది. అంతేకాదు, మహిళా ఆర్టిస్టులను ఆయన `అదీ.. ఇదీ` అని సంభోదిస్తారని వ్యాఖ్యానించింది.













