NTRNeel: ఎన్టీఆర్ నీల్ సినిమాకు టాలీవుడ్ యంగ్ రైటర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం కెజిఎఫ్(KGF), సలార్(Salaar) ఫేమ్ ప్రశాంత్ నీల్(prasanth Neel) దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్(rukmini vasanth) హీరోయిన్ గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers), ఎన్టీఆర్ ఆర్ట్స్(Ntr arts) సంస్థలు భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్‌నీల్(NTRNeel) సినిమాను నిర్మించనున్నాయి. ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా గురించి ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం నీల్ మొదటిసారి ఎన్టీఆర్ కు చెప్పిన కథకు తారక్(tarak) కొన్ని మార్పులు చేయమని చెప్పగా, నీల్ ఆ కథను రెండు సార్లు మార్చినా కూడా తారక్ కన్విన్స్ అవలేదని, దీంతో ఆ కథను యంగ్ రైటర్ నాగేంద్ర కాసి(nagendra kasi) చేతిలో పెట్టి దాన్ని డెవలప్ చేయించారని సమాచారం.
నీల్ చెప్పిన కథను నాగేంద్ర కాసి కొంచెం ఛేంజ్ చేసి ఫైనల్ వెర్షన్ సిద్ధం చేయగా, ఆ కథ నీల్ కు కూడా నచ్చడంతో ఆ వెర్షన్ తోనే సినిమాను నీల్ సెట్స్ పైకి తీసుకెళ్లాడని తెలుస్తోంది. కాగా నాగేంద్ర గతంలో అల్లు అర్జున్(Allu arjun) (పుష్ప2), రామ్ చరణ్(Ram charan) పెద్ది(Peddhi) సినిమాలకు రైటర్ గా వర్క్ చేశాడు. ఇప్పుడు నీల్ఎన్టీఆర్ సినిమా కథలో నాగేంద్ర కీలక పాత్ర పోషించడం విశేషం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.