నా సామిరంగ టీజర్ టాక్
ది ఘోస్ట్ సినిమా డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, తన 99వ సినిమాను ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో చేశాడు. అదే నా సామిరంగ. ఆషికా రంగనాథన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో నాగార్జున ఊర మాస్ పల్లెటూరి గెటప్ లో కనిపించనున్నాడని అర్థమవుతుంది. ఊరంతా మొరటోడుగా పిలుచుకునే రంగ (నాగార్జున) ఎవరినీ లెక్క చేయడు. అతినికి ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్లే అల్లరి నరేష్, రాజ్ తరుణ్. రంగకు ప్రియురాలు కూడా ఉంటుంది. ఊళ్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల రంగకు అతని ఫ్రెండ్స్, ప్రేమించిన అమ్మాయి ఎనిమిదేళ్లు దూరమవుతారు.
ఈ లోపు జాతరలో కత్తులు, అక్కడ గొడవలు జరుగుతాయి. అసలు రంగకు తన ఫ్రెండ్స్, ప్రేమించిన అమ్మాయి దూరమవడానికి గల కారణమేంటన్నది మాత్రం వెండి తెర పైనే చూడాలి. టీజర్లో నాగ్ ను డైరెక్టర్ ప్రెజెంట్ చేసిన తీరు సినిమాపై అంచనాల్ని పెంచేలా ఉంది. ఈ సినిమా మూల కథ పోరంజు మరియం జోస్ అయినప్పటికీ మన నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేశారని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. చూస్తుంటే నాగార్జున సంక్రాంతికి నా సామిరంగతో బాగానే సందడి చేసేట్లు కనిపిస్తున్నాడు.













