పూరి, నాగార్జున హాట్ట్రిక్ మూవీ ఎప్పుడో?
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ఫాంలోకి వచ్చాడు. పూరీ సినిమా అంటే ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపించాడు. ఇస్మార్ట్ శంకర్ హిట్ పూరీకి ఇచ్చిన హిట్టు కిక్కుతో ఈసారి విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నారు. మేకింగ్ టైటిల్ ఫైటర్ అంటూ పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న పూరీ బీ టౌన్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. దేవరకొండ ఫ్యాన్స్ అందరు మెచ్చేలా బాలీవుడ్ ఆడియెన్స్ ను కూడా అలరించేలా ఫైటర్ కథ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత స్టార్ హీరోతో పూరీ హ్యాట్రిక్ సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యారు. పూరీ డైరక్షన్ లో సూపర్, శివమణి సినిమాలతో హిట్ అందుకున్నారు కింగ్ నాగర్జున. మరోసారి ఈ క్రేజీ కాంబో ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ కాంబినేషన్ లో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పూరీతో నాగార్జున హ్యాట్రిక్ మూవీ కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్. ఫైటర్ తర్వాత పూరీ చేస్తున్న ఈ సినిమాకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రెండు కథలు లైన్ లో పెట్టారు. అందులో పూరీ సినిమా కథ కూడా ఉందని టాక్. పూరీతో కింగ్ సినిమా అనగానే అక్కినేని ఫ్యాన్స్ లో హంగామా మొదలైంది. నాగ్ తో మరోసారి పూరీ మార్క్ మాస్ మూవీ ఆశిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.













