ఈ పరిస్థితిలో నాగార్జునకు అలా చేయడం అవసరమా?
సోగ్గాడే చిన్నినాయనా తర్వాత హీరో నాగార్జునకు సరైన కమర్షియల్ హిట్ లేదు. ఆ సినిమా తర్వాత చేసిన అరడజను సినిమాలు బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రస్తుతం వైల్డ్ డాగ్ పేరుతో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఎన్ఐఎ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కథ ప్రకారం థాయ్‌లాండ్‌లో ఓ షెడ్యూల్ చెయ్యాల్సి ఉంది. కానీ, షూటింగ్స్‌కి ఇప్పటివరకు అనుమతి లేకపోవడంతో ఆ షెడ్యూల్‌ను పోస్ట్‌పోన్ చేశారు. ఇప్పుడు థాయ్‌లాండ్‌లో షూటింగ్ చేసుకునే అవకాశం ఉండడంతో యూనిట్ అంతా అక్కడికి వెళ్లే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో విదేశాల్లో షూటింగ్ చేయడం ఎంతో రిస్క్‌తో కూడుకున్న పని. అయితే నాగార్జున ఆ రిస్క్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి నాగార్జున చేస్తున్న ఈ రిస్క్‌ని మిగతా టాప్ హీరోలు ఎలా తీసుకుంటారో చూడాలి. వాళ్ల సినిమాల షూటింగ్ కోసం వాళ్లు కూడా ఇంత రిస్క్ చేస్తారా?
వైల్డ్ డాగ్తోపాటు నాగార్జున హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అయినా ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ క్యారెక్టర్ చెయ్యడానికి అంగీకరించారు నాగార్జున. గతంలో కూడా ఇలాంటి చిన్న పాత్రలు బాలీవుడ్లో చేశారు. మరోవైపు తమిళ్లో ధనుష్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. నాన్రుద్రన్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా కొంతకాలం క్రితం ఆగిపోయింది. ఈ లాక్డౌన్ సమయంలో ధనుష్ ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.













