Nagarjuna: కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రయోగాలు చేస్తూనే ఉన్నా
కెరీర్లో ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు, క్యారెక్టర్లు చేయడంలో కిక్కేముంటుందంటున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున. అందులో భాగంగానే నాగార్జున(nagarjuna) ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. నిన్నే పెళ్లాడతా(ninne pelladatha) లాంటి సూపర్ హిట్ తర్వాత అన్నమయ్య(annamayya) లాంటి సినిమా చేసే సాహసం ఎవరూ చేయలేరు. కానీ నాగార్జున చేశారు. చేయడమే కాదు, ఆ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచారు.
రీసెంట్ గా కుబేర(kuberaa)లో డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆడియన్స్ ను మెప్పించిన నాగార్జున ఇప్పుడు రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. కూలీ సినిమాలో సైమన్(saimon) క్యారెక్టర్ చేయడం తనకెంతో థ్రిల్లింగ్ గా ఉందని చెప్పిన నాగ్(nag), తనకు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చిన నెగిటివ్ క్యారెక్టర్ సైమన్ అని చెప్తున్నారు.
సైమన్ పాత్ర తనను బెస్ట్ యాక్టర్ గా మార్చిందని చెప్పిన ఆయన, నిన్నే పెళ్లాడతా నుంచి కూలీ(Coolie) వరకు తానెప్పుడూ కొత్త పాత్రలను చేస్తూనే ఉన్నానని, ఖైదీ(khaidhi) సినిమా చూసినప్పటి నుంచే లోకేష్(lokesh Kanagaraj) తో సినిమా చేయాలనుకుంటున్నానని అది కూలీతో నెరవేరిందని అన్నారు. ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న కూలీపై అందరికీ భారీ అంచనాలున్నాయి.







