రెండు పడవల ప్రయాణం చేయనున్న చైతూ
కస్టడీ సినిమాతో దారుణమైన ఫెయిల్యూర్ అందుకున్న అక్కినేని నాగచైతన్య తన తర్వాతి సినిమాపైనే ఆశలను పెట్టుకున్నాడు. ఒకసారి ఒక సినిమానే చేసే హీరోలున్న ఈ జెనరేషన్ లో ఇప్పుడు చైతూ రెండు సినిమాలలో ఒకేసారి సమాంతరంగా నటించబోతున్నాడట. కార్తికేయ2 సినిమా తర్వాత చందూ మొండేటి నాగ చైతన్య కోసం ఓ స్టోరీ రెడీ చేసిన విషయం తెలిసిందే.
గీతా ఆర్ట్స్ బ్యానర్ రూపొందించనున్న ఈ సినిమా చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కబోతుంది. గుజరాతీ కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు టాక్. చైతూ ఇందులో జాలరిగా కనిపించనున్నాడని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తోంది.
దీంతో పాటూ చైతూ శివ నిర్వాణ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ఒప్పుకున్నాడని టాక్. మజిలీ తర్వాత శివతో చైతూ మరో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఖుషి సినిమాలో బిజీగా ఉన్న శివ చైతూకి ఆల్రెడీ ఓ లవ్ స్టోరీ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని, ఈ ఏడాది చివర్లోనే ఆ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో మరి చందూ మొండేటి పరిస్థితేంటని అనుకుంటున్న టైమ్ లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. చైతూ ఈ రెండు సినిమాలను వెంట వెంటనే మొదలుపెట్టి సెట్స్ కు తీసుకెళ్లి సమాంతరంగా రెండు సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నాడట. మరి ఇదెంత వరకు వర్కవుట్ అవుతుందనేది చూడాలి.













