కొత్త అవతారంతో బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్న మెగా బ్రదర్!
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి – యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో 2015లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఛత్రపతి’ రీమేక్ ద్వారా హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ రీమేక్ మూవీకి వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతిలాల్ గడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తెలుగులో రాక్షసుడు మినహా ఈ హీరోకు చెప్పుకోదగ్గ హిట్ లేదు. కానీ తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్ అండ దండలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే వచ్చాడు ఈ హీరో. సినిమాలు ప్లాపైనా ఈ హీరో సినిమాలకు హిందీ అనువాదంలో యూ ట్యూబ్‌లో మిలియన్ సంఖ్యలో వ్యూస్ రావడంతో బాలీవుడ్ లో సినిమా తీయాలనే ఆలోచనకి వచ్చాడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని అందరికీ చేరువయ్యేలా స్క్రిప్ట్ లో మార్పులు చేసే పనిలో ఉన్నాడట దర్శకుడు వీ వీ వినాయక్.
ఇకపోతే ఈ చిత్రంలో విలన్ క్యారెక్టర్ గా మెగా బ్రదర్ నాగబాబు సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. వార్తలకి తగ్గట్టుగానే ఈ మధ్య నాగబాబు కూడా కొత్త గెటప్ తో సోషల్ మీడియాలో తన ఫోటోలు చేశారు. పలు చిత్రాల్లో కీలక పాత్ర పోషించిన నాగబాబు, ప్రేక్షకులకి ఎక్కువ సుపరిచితమైంది ‘ జబర్దస్త్’ కామెడీ షోలో జడ్జి గానే అని చెప్పాలి. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పలు సినిమాలను కూడా నిర్మించి నిర్మాతగానూ తనదైన ప్రత్యేకతను చాటుకున్న నాగబాబు, ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంటర్ అవబోతున్నాడనే వార్త అందరిని ఆశ్యర్యానికి గురిచేస్తుంది. నాగబాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి త్వరలోనే మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.













