నా సామిరంగ తర్వాత #DNS … మంచి నిర్ణయమే!
మొత్తానికి చాలా సినిమాల తర్వాత నాగార్జున ఖాతాలో నా సామిరంగ హిట్ పడింది. ఈ సినిమాను అక్టోబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లిన నాగార్జున ఎంతో త్వరగా పూర్తి చేసి జనవరిలో సంక్రాంతికి రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. ఎన్ని సినిమాలున్నా సంక్రాంతికి ఫ్యామిలీ మూవీ వస్తే ఆడియన్స్ ఆదరిస్తారని ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాగార్జున.
అందుకే సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్ ఉన్నా నా సామిరంగ సినిమా మీద గట్టి నమ్మకంతో రిలీజ్ చేసి సినిమాను హిట్ చేశాడు. ఆ సక్సెస్ ఇచ్చిన బూస్ట్ తో నాగార్జున తన నెక్ట్స్ సినిమాను లైన్ లో పెట్టి సెట్స్ పైకి తీసుకెళ్లాడు నాగ్. నాగార్జున ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చేస్తున్నాడు.
భారీ బడ్జెట్ తో సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రీసెంట్‌గానే ఈ సినిమాకు #DNS అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టి షూటింగ్ ను స్టార్ట్ చేశారు. గత కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ లేక ఇబ్బంది పడిన నాగ్, నా సామిరంగ తర్వాత ఈ సినిమా చేయడం చాలా పర్ఫెక్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఇక మీదట నాగ్ తన మార్క్ సినిమాలతో ఆడియన్స్ ను అలరించాలని చూస్తున్నాడట. అందుకే ఈ మల్టీస్టారర్ చేస్తున్నట్లు నాగ్ సన్నిహితులు చెప్తున్నారు. అంతేకాదు నాగ్ ఇకపై తన సినిమాల వేగాన్ని కూడా పెంచాలని డిసైడయ్యాడట.













