Nag Ashwin: 400 ఎకరాలపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏమంటున్నారంటే
తెలంగాణ గవర్నమెంట్ అమ్మాలనుకుంటున్న 400 ఎకరాల విషయంలో మన ఖర్మ అంటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) గతంలో చేసిన పోస్ట్ గురించి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ విషయమై నాగి మాట్లాడారు. ఎవడే సుబ్రమణ్యం(Yevade Subramanyam) రిలీజై పదేళ్లవుతున్న సందర్భంగా మార్చి 21న ఆ మూవీని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు.
మన ఖర్మ, ఏమీ చేయలేం అని గతంలో పోస్ట్ ఎందుకు చేశారని నాగిని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా, దానికి నాగి, 400 ఎకరాల్లో ఉన్న చెట్లు కొట్టేస్తారని తెలియడంతో తాను ఆ పోస్ట్ చేశానని, అది తీసేయాలని తెలిపారు. నిజంగా ప్రభుత్వం అభివృద్ధి కోసమే ఆ పని చేస్తుంటే టైర్2 సిటీస్పై ఫోకస్ చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అయినా అదే ఏరియాలో చాలా ఐటీ పార్కులున్నాయని, వాటిలో సగం ఖాళీగానే ఉన్నాయని, ఆ స్పేస్ ను వాడుకుని ఈ చెట్లను నరికేయకుండా ఉంటే మంచిదని, వీలైతే ఆ చెట్లను కాపాడటానికి మీడియా కూడా ట్రై చేస్తే బావుంటుందని నాగి సూచించారు. దానికి తోడు గవర్నమెంట్ అమ్మాలనుకుంటున్న ల్యాండ్ గ్రీన్ జోన్ ఏరియా అని, అక్కెడన్నో అరుదైన వన్య ప్రాణులతో పాటూ పక్షి జాతులు నివసిస్తున్నాయని, దాన్ని నాశనం చేయడం సరైన డెసిషన్ కాదని నాగి తెలిపారు.













