Kalki2: కల్కి2ను హోల్డ్ లో పెట్టిన డైరెక్టర్

నాగ్ అశ్విన్(nag ashwin) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) నటించిన కల్కి(Kalki) సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమాకు సీక్వెల్ ను కూడా నాగ్ అశ్విన్ అనౌన్స్ చేశాడు. కల్కి హిట్ అవడంతో కల్కి2(kalki2) సినిమాను మరింత జాగ్రత్తగా తీయాలనే ఆలోచనతో ఈ స్క్రిప్ట్ ను ఎంతో పకడ్బందీగా రెడీ చేస్తున్నాడు నాగి.
అన్నీ అనుకున్నట్టు జరిగితే కల్కి సీక్వెల్ ఈ ఏడాదిలోనే మొదలు పెట్టాలని ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు ప్రాజెక్టులుండటంతో ముందు అవి పూర్తి చేయాల్సి ఉంది. అయితే కల్కిని ఈ ఇయర్ తీయాలనే ప్లాన్ లో నాగ్ అశ్విన్ ఆ సినిమాలో కీలక పాత్రలు చేయనున్న కమల్ హాసన్(kamal Hassan), అమితాబ్(amithab), దీపికా(deepika Padukone) డేట్స్ ను అడిగి తీసుకున్నాడు.
అయితే అందరూ డేట్స్ ను కేటాయించినప్పటికీ ప్రభాస్ మాత్రం తన డేట్స్ ను ఇంకా ఇవ్వలేదు. ప్రభాస్ కల్కి2 ను మొదలుపెట్టాలంటే దాని కంటే ముందే తన చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ ఫినిష్ చేయాల్సి ఉంది. అంటే చాలానే టైమ్ పడుతుంది. అందుకే ప్రస్తుతానికి నాగ్ అశ్విన్ కల్కి2 ప్లాన్స్ ను హోల్డ్ లో పెట్టి మరో రెండు కొత్త ప్రాజెక్టులపై వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. కల్కి2 కోసం ప్రభాస్ బల్క్ లో డేట్స్ ను అడ్జస్ట్ చేసిన తర్వాతే మిగిలిన వారి డేట్స్ ను కూడా తీసుకుని కల్కి2 సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు నాగ్ అశ్విన్.