Nag Ashwin: కమల్ ఐడియాలతో ముందుకెళ్లనున్న నాగి?
కమల్ హాసన్(Kamal Hassan) నటన గురించి, ఆయన సెలెక్ట్ చేసుకునే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడియన్స్ కు కొత్త ఫీల్ అందించాలనే కోణంలో కమల్ సినిమాలు చేస్తుంటాడు. మంచి ఐడియాలతో వచ్చే రైటర్లని, డైరెక్టర్లని ఎంకరేజ్ చేయడంలో కమల్ ముందుంటాడు. రీసెంట్ గా కల్కి(Kalki) సినిమలో సుప్రీమ్ యాస్కిన్ గా మెప్పించాడు కమల్.
కల్కిలో కేవలం 7 నిమిషాలకే ఆయన పాత్ర పరిమితమైంది కానీ రెండో భాగంలో కమల్ పాత్ర ఎక్కువగా ఉంటుందని, తన పాత్రను నాగ్ అశ్విన్(Nag Ashwin) ఎంతో గొప్పగా రాశాడని కమల్ పలు సందర్భాల్లో ప్రశంసించాడు. అంతేకాదు నాగి(Nagi) తన ఆలోచనలకు చాలా దగ్గరగా ఉన్నట్టు కూడా కమల్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే రీసెంట్ గా కమల్-నాగి ఓ ఈవెంట్ లో ఇంటరాక్ట్ అయారు.
టాలీవుడ్ లో ఎంతో మంది డైరెక్టర్లున్నప్పటికీ కమల్(Kamal) నుంచి నాగికి మాత్రమే పిలుపొచ్చింది. ఆ ఈవెంట్ లో కమల్ హాసన్, నాగ్ అశ్విన్ వరల్డ్ సినిమాను టార్గెట్ చేసేలా కొన్ని ఆలోచనలను పంచుకున్నారని, వాటిని ఇంప్లిమేట్ చేసి రాయగలిగితే వండర్స్ క్రియేట్ చేయొచ్చని అనుకున్నారట. దానికి ప్రస్తుతం తన దగ్గరున్న టాలెంట్ సరిపోదని, ఫ్యూచర్ లో కలిసి పనిచేద్దామని కమల్ తో నాగి చెప్పినట్టు సమాచారం.













