Nag Ashwin: కల్కి2 గురించి మాట్లాడిన నాగి
గతేడాది రిలీజైన కల్కి2898ఏడీ(Kalki 2898AD) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన సత్తాను చాటిన నాగి(Nagi), ఆ మూవీతో రూ.1000 కోట్ల మార్క్ ను టచ్ చేశారు. కల్కి బ్లాక్ బస్టర్ అయినప్పటి నుంచి కల్కి2(Kalki2) పై ఆసక్తి బాగా పెరిగింది. అందుకే సినిమాకు సంబంధించిన ఎవరు కనిపించినా ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ కల్కి2 అప్డేట్ అడుగుతున్నారు. రీసెంట్ గా ఎవడే సుబ్రమణ్యం(Yevade Subramanyam) రీరిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కూడా నాగ్ అశ్విన్(Nag Ashwin) కు ఇదే ప్రశ్న ఎదురవగా ఇప్పుడు మరోసారి ఆయనకు కల్కి2 గురించి ప్రశ్న ఎదురైంది.
నాగ్ అశ్విన్ తాజాగా కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లి స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామి దర్శనం అనంతరం బయటకు వస్తున్న నాగిని చూసి అక్కడి అభిమానులు ఒక్కసారిగా చుట్టూ చేరి ఆయనతో సెల్ఫీలు దిగారు. అనంతరం నాగి మీడియాతో మాట్లాడుతూ, చాలా కాలం తర్వాత తిరుమల వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ బావుండాలని కోరుకున్నట్టు తెలిపారు.
ఆ తర్వాత కల్కి2 గురించి మీడియా అడగ్గా, దాని గురించి మాట్లాడారు నాగి. ప్రస్తుతం కల్కి2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, సినిమా రావడానికి ఇంకా చాలా టైమ్ పడుతుందని అన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే కల్కి2 ను ఈ సంవత్సరం ఆఖరి నుంచి షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం విన్న డార్లింగ్ ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.













